: వీడనున్న మిస్టరీ... నేడే జయలలిత హెల్త్ రిపోర్ట్ బహిర్గతం!


గత కొంత కాలంగా తీవ్రవివాదంగా మారిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మిస్టరీ నేటితో వీడిపోనుంది. నేడు జయలలిత హెల్త్ రిపోర్ట్ బహిర్గతం కానుంది. జయలలిత హెల్త్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఎయిమ్స్ వైద్యులు సమర్పించారు. దీంతో ప్రభుత్వం నేడు ఆ హెల్త్ రిపోర్ట్ ను బహిర్గతం చేయనుంది. కాగా, జయలలిత మృతి తమిళనాట పెను సంచలనంగా మారింది. జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఆమె మృతిపై మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో సగటు పౌరులు ఆమె మరణం వెనుక వాస్తవాలేంటన్నది తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.

గతంలో అపోలో వైద్యులు, విదేశీ వైద్యుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆమె మృతి వెనుక కారణాలు వెల్లడించినప్పటికీ వారిచ్చిన వివరణ మరిన్ని అనుమానాలకు తావిచ్చిందే తప్ప అనుమానాలను తీర్చలేదు. ఈ క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన ఆరోపణలు మరిన్ని అనుమానాలను బలపరిచాయి. దీంతో నేడు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించే హెల్త్ రిపోర్ట్ తో జయలలిత మృతి మిస్టరీ వీడిపోనుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News