: అసెంబ్లీ బయట గదులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయి: జగన్
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనంలో ఈ రోజు తొలి సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్లోకి తన పార్టీ సభ్యులతో కలిసి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అనంతరం అసెంబ్లీ నిర్మాణం గురించి మాట్లాడుతూ అసెంబ్లీ బాగానే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, బయట గదులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఆ అసెంబ్లీ భవనాన్ని తాత్కాలికంగా ఉంచడం కంటే శాశ్వతంగా ఉంచితేనే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.