: నన్ను సర్పంచ్ గా ఉండమని టీడీపీ అధ్యక్షుడు చెబితే, అదే చేస్తా: నారా లోకేశ్
తనను సర్పంచ్ గా ఉండమని టీడీపీ అధ్యక్షుడు చెబితే, అదే చేస్తానని నారా లోకేశ్ అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, స్థానిక నేతలతో కలిసి లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, తాను ఇంకొకరి చేత రాజీనామా చేయించి పోటీ చేయాలని అనుకోవడం లేదని, తాను పోటీ చేయాలా? లేదా? అనే నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి తన ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఆ హామీని నిలబెట్టుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా లోకేశ్ చెప్పారు.