: వారికి చెడ్డపేరు మాత్రం తీసుకురాను: నారా లోకేశ్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోలేకపోయినా, తన తాత, తండ్రికి మాత్రం చెడ్డపేరు తీసుకురానని అన్నారు. పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా చేరిన ఐదు సంవత్సరాలకే తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కడం ఆనందంగా ఉందని, అతి తక్కువ కాలంలో తనకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు, కళా వెంకట్రావులకు తన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాజకీయాల్లో ఇతరులతో పోల్చుకునేంత అనుభవం తనకు ఇంకా రాలేదని లోకేశ్ అన్నారు.