: కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమే!: 'ఓటుకు నోటు' కేసులో సుప్రీం నోటీసులపై చంద్రబాబు
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులలో పేర్కొంది. ఈ నోటీసులపై చంద్రబాబు స్పందిస్తూ, కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని... ఇందులో కొత్తేమీ లేదని అన్నారు. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అసలు ఓటుకు నోటు కేసులో ఏమీ లేదని అన్నారు. ఇప్పటి వరకు తనపై 26 కేసులు వేశారని... ఏదీ నిలబడలేదని చెప్పారు. ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు... చంద్రబాబుకు నోటీసులు పంపింది.