: రద్దయిన నోట్ల డిపాజిట్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు


నోట్ల రద్దు, ఆపై బ్యాంకుల్లో డిపాజిట్ కు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాల తరువాత కూడా ప్రజల వద్ద ఇంకా మిగిలిన పాత రూ. 500, రూ. 1000 నోట్ల డిపాజిట్ పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పాత నోట్లు ఇంకా వ్యవస్థలో ఉంటే వాటిని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన న్యాయస్థానం, కేంద్రం తన సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాలని ఆదేశించింది. పాత నోట్లను మార్చి 31 వరకూ ఎందుకు తీసుకోరో చెప్పాలని ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేస్తూ, ఈ లోగా సమాధానం చెప్పాలని సూచించింది.

  • Loading...

More Telugu News