: తెలంగాణ గురించి నేనెప్పుడైనా నెగిటివ్‌గా మాట్లాడానా?: చంద్రబాబు
రాష్ట్ర విభజన తనను ఎంతో బాధపరిచిందని వ్యాఖ్యానిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పలువురు టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చంద్రబాబు ఈ రోజు స్పందించారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ, ఏపీల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని అన్నారు. ‘హైదరాబాద్ నా కృషి కాదా? నా కష్టార్జితం కాదా? నేను ఎప్పుడైనా హైదరాబాద్ గురించి గానీ, తెలంగాణ గురించి గానీ నెగిటివ్‌గా మాట్లాడానా? నేను ఎంతో స్పష్టంగా ఉన్నాను. జరిగిన అన్యాయం, ఏపీకి చేసిన అన్యాయం గురించే నేను మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయం గురించి కసితో ఉండకపోతే అభివృద్ధి జరగదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.