: ఒకప్పుడు అమెరికాలో ఎంతో భద్రత ఉండేది: చంద్రబాబు
ఒకప్పుడు అమెరికాలో ఎంతో భద్రత ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారతీయులపై అమెరికాలో జరుగుతున్న దాడులపై స్పందించారు. ప్రపంచానికే లీడర్‌గా ఉన్న అమెరికా లాంటి దేశంలో ఇవన్నీ జరగడం విచారకరమని అన్నారు. మొన్నటి వరకు మన దేశీయులు అమెరికా వెళదామని ఎంతో ఆశ పడ్డారని, ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఒకప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా పనిచేస్తుందని మంచి పేరు ఉండేదని అన్నారు. అమెరికా నాయకత్వం వల్ల ఆ దేశ భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి వస్తోందని అన్నారు. ప్రతిరోజూ వార్తల్లో అక్కడ జరుగుతున్న దాడుల గురించి వింటున్నామని అన్నారు. ఈ రోజు కూడా మరోవార్త వినాల్సి వచ్చిందని చెప్పారు.