: చంద్రబాబు తప్పించుకోవడం అసాధ్యం: న్యాయవాది పొన్నవోలు


ఓటుకు నోటు కేసు నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోవడం అసాధ్యమని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసులో న్యాయం తమ పక్షానే ఉంటుందని చెప్పారు. ఓటుకు నోటు కేసుపై ఆళ్ల వేసిన పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు స్వీకరించింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలంటూ చంద్రబాబుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని కోర్టు తెలిపింది.

ఈ సందర్భంగా న్యాయవాది పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ, కేసు చాలా తీవ్రమైందన్న విషయాన్ని కోర్టు గుర్తించిందని చెప్పారు. కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని... విచారణ సమయంలో వాటన్నిటినీ కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News