: టీడీపీలో జూనియర్ అయిపోయా... బాబును నిలదీయలేకున్నా: వాపోయిన ఎంపీ రాయపాటి
వయసుపరంగా, కాంగ్రెస్ పార్టీలో అనుభవం పరంగా తాను సీనియర్ ను అయినప్పటికీ, తెలుగుదేశం విషయానికి వస్తే మాత్రం తాను జూనియర్ నేనని, అందువల్లే చంద్రబాబు నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, తాను ప్రశ్నించలేక పోతున్నానని వాపోయారు. చంద్రబాబు కమ్మ కులాన్ని ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదని ఆరోపించిన రాయపాటి, టీడీపీ కోసం పనిచేసిన వారిని, పార్టీని నిలబెట్టిన వారిని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయన్ను నిలదీద్దామని ఉన్నా, ఆ పని చేయలేకున్నానని చెప్పుకొచ్చారు. గ్రామస్థాయి పార్టీ క్యాడర్ చాలా నిరుత్సాహంగా ఉందని, ఇది పార్టీ మనుగడకు, భవిష్యత్తుకు ఎంతమాత్రమూ మంచిది కాదని అన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు వెంటనే నడుం బిగించాలని అన్నారు.