: ఆపిల్‌ ఐఫోన్ 6 పై అమెజాన్‌లో నేడు, రేపు తగ్గింపు ధరలు


ఆపిల్‌ ఐఫోన్ 6 పై ఈ-కామ‌ర్స్ సంస్థ‌ అమెజాన్ డిస్కౌంట్‌ ప్ర‌క‌టించింది. 32 జీబీ వేరియంట్ గ‌ల‌ ఈ ఫోను అసలు ధర.30,700 గా ఉంది. అయితే, అమెజాన్‌లో రూ 28.999లకే ల‌భిస్తోంది. ఈ ఆఫ‌ర్ నేడు, రేపు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నుంది. కొనుగోలు చేసిన తేదీ నుండి బ్యాటరీలు సహా, ఇన్‌ బాక్స్ యాక్ససరీస్‌ పై ఒక సంవత్సరం వారంటీ స‌హా ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందిస్తోంది. ఈ ఐఫోన్‌లో 4.7 ఇంచెస్‌ డిస్‌ ప్లే, 1334 x 750 రిజల్యూషన్‌, 1జీబీ ర్యామ్‌, 8ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఆటో ఫోకస్‌, 1.2 ఎంపీ ముందు కెమెరా, 1810 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్ధ్యం ఫీచ‌ర్లుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను అమెజాన్ త‌మ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

  • Loading...

More Telugu News