: లంచ్ తరువాత నాలుగో బాల్ కే ముకుంద్ అవుట్
కుదురుగా నిలదొక్కుకుని ఆడుతున్నారన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ, లంచ్ తరువాత నాలుగో బంతికే ఓపెనర్ ముకుంద్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజెల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ అయి పెవిలియన్ చేరడంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. 11వ ఓవర్ ను హాజిల్ వుడ్ వేయగా, ఆఫ్ సైడ్ పడిన బంతి, స్వింగ్ అవుతూ వచ్చి ముకుంద్ వెనకున్న వికెట్లను తాకింది. ముకుంద్ అవుటైన తరువాత మరో ఓపెనర్ రాహుల్ కు జతగా ఛటేశ్వర్ పుజారా వచ్చి కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే మరో 41 పరుగులు వెనుకబడివుంది.