: అమెరికాలో మరో ఘోరం.. తెలంగాణ యువతిపై కాల్పులు


అగ్రదేశం అమెరికాలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజు భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా, ఓ తెలుగు యువతిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిని తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతిగా గుర్తించారు. అతి తక్కువ వ్యవధిలోనే శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్, దీప్ రాయ్ లపై జాతి విద్వేష దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల నేపథ్యంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇంతలోనే, జ్యోతిపై కాల్పులు జరగడంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News