: మరో జీవితం మొదలైంది... నామినేషన్ వేసేశాను: ట్విట్టర్ లో నారా లోకేష్


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం తాను నామినేషన్ దాఖలు చేస్తున్న చిత్రాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా లోకేష్ అభిమానులతో పంచుకున్నారు. తాను నామినేషన్ దాఖలు చేశానని, ఈ సందర్భంగా తనతో పాటు అసెంబ్లీకి వచ్చి మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలని, ఈ సమయం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మరో జీవితం మొదలైందని, ప్రజా ప్రతినిధిగా, రాష్ట్రాభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ విస్తరణకు తనవంతు కృషి చేస్తానని ఆయన రేలిపారు.

  • Loading...

More Telugu News