: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా


వెల‌గ‌పూడిలోని కొత్త‌ అసెంబ్లీ భవనంలో తొలి శాస‌న‌స‌భ‌ సమావేశాలు ఈ రోజు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. స‌భ ప్రారంభం కాగానే గవర్నర్ నరసింహన్ ప్ర‌సంగం చేశారు. అనంత‌రం స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. రెండున్న‌రేళ్ల‌లో ఏపీలో జరిగిన అభివృద్ధి ప‌నుల‌పై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించారు. అలాగే తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న అన్నారు. దివ్యాంగుల‌కు పింఛ‌ను, రాయితీ ద్వారా త‌క్కువ ధ‌ర‌కే ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా భోజ‌న ప‌థ‌కం, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం మంజునాథ క‌మిష‌న్ వంటి అన్ని అంశాల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. రేపు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష సభ్యులను దీటుగా జవాబు ఇవ్వడానికి టీడీపీ సభ్యులు కూడా సన్నద్ధంగా ఉన్నారు. 

  • Loading...

More Telugu News