: ప్రజల్లో కలసిపోయిన నరేంద్ర మోదీ సోదరుడు... ఎవరూ గుర్తు పట్టలేదు!


ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వయానా సోదరుడు. జనాల్లో కలిసిపోయి సాదాసీదాగా నడిచి వెళుతున్నా ఎవరూ గుర్తు పట్టలేదు. గడచిన వారం రోజుల వ్యవధిలో మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసికి ఆయన రెండు సార్లు వచ్చి వెళ్లారు. రోడ్లపై ఆయన తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. నిన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మోదీ పర్యటిస్తున్న వేళ ఆయన సోదరుడు సొంభాయ్ మోదీ కూడా వారణాసిలోనే ఉన్నారు. తనకు, తన సోదరుడి పర్యటనకూ ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు.

తనను గుర్తు పట్టిన కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్ అంటే చాలా ఆగ్రహం నెలకొని వుందని అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన్ను ప్రజల నుంచి వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. తాను తన తమ్ముడి ఇంటికెళితే, దేశం కోసం ఆయన కేటాయిస్తున్న సమయంలో కొంత వృథా చేసినట్లవుతుందని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News