: నా తండ్రిలా ఇతరులు ఎవరూ ఇబ్బంది పడకూడదు: హీరో విశాల్
తన తండ్రి జీకే రెడ్డిలా ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడకూడకూడదని హీరో విశాల్ అన్నాడు. ఎన్నో సినిమాలను నిర్మించిన తన తండ్రి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పాడు. ఓ చిత్రాన్ని విడుదల చేయాలంటే నిర్మాతల సంఘం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపాడు. నిర్మాతల సంఘానికి తాను పోటీ చేస్తుండటానికి ఇదే ప్రధాన కారణమని చెప్పాడు. నిర్మాతల మండలిలోని సమస్యలను తీర్చడానికి తాను అవిశ్రాంతంగా కృషి చేస్తానని తెలిపాడు.
త్వరలో జరగనున్న తమిళ సినీ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విశాల్ పోటీ చేస్తున్నాడు. ప్రస్తుతం నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ యంగ్ హీరో వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పాడు. ఏప్రిల్ లో సంఘం భవన నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపాడు. నిర్మాతల సమస్యలను తీర్చడానికే నిర్మాతల సంఘం ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పాడు.