: తిరుప్పూర్ లో ఖాళీ అయిన శశికళ శిబిరం... పన్నీర్ కు మద్దతు


శశికళ కనుసన్నల్లో నడవడం ఇష్టం లేని తిరుప్పూర్ జిల్లాలోని అన్నాడీఎంకే నేతలు పన్నీర్ కు మద్దతు తెలిపారు. దీంతో ఆ జిల్లాలో శశికళ శిబిరం దాదాపూ ఖాళీ అయింది. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు మాజీ సీఎం పన్నీర్ కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యురాలు సత్యభామ, తిరుప్పూరు అన్నాడీఎంకే అధ్యక్షుడు, కార్యదర్శులు, మైనారిటీ, రైతు, జాలర్ల విభాగాలు, ఎంజీఆర్ యువనేన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మునిసిపల్ అధ్యక్షుల్లో అత్యధికులు శశికళ వెంట ఉండబోమని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, అన్నాడీఎంకే వైద్య విభాగం సైతం పన్నీర్ కు మద్దతు ప్రకటించింది.

  • Loading...

More Telugu News