: జాతీయ పతాకం భారీతనంలో హైదరాబాదు రికార్డును బ్రేక్ చేసిన అటారీ!
మన దేశంలోన అత్యంత ఎత్తైన జాతీయ పతాకం ఎక్కడుంది? అనే ప్రశ్నకు ఇప్పటి వరకు హైదరాబాద్ అనే సమాధానం వచ్చేది. అత్యంత ఎత్తైన జాతీయ పతాకం తెలంగాణలోనే ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్ రోడ్డులో 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్ కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీనిని ఏర్పాటు చేసింది.
గతంలో ఈ రికార్డు జార్ఖండ్ రాజధాని రాంచీ పేరిట ఉండేది. అక్కడ 293 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇప్పుడు హైదరాబాద్ రికార్డు కూడా బద్దలయింది. అమృత్ సర్ సమీపంలో ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఉన్న అటారీలో 360 అడుగుల ఎత్తులో జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా పొడవే 12 అడుగులు ఉంది. ఈ ఉదయం ఈ పతాకాన్ని ఆవిష్కరించారు.