: అల్లుడి చేత స్వయంగా నామినేషన్ వేయించిన బాలకృష్ణ
తన అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేత, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలకృష్ణ దగ్గరుండి నామినేషన్ వేయించారు. ఈ ఉదయం శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన లోకేష్, తన నామినేషన్ పేపర్లను ఎన్నికల అధికారికి అందించారు. లోకేష్ అభ్యర్థిత్వాన్ని కళా వెంకట్రావు, మంత్రి కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు బలపరిచారు. కాగా, అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో మరికాసేపట్లో తొలి సభ గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభం కానుంది.