: రేఖను సంజయ్ దత్ పెళ్లి చేసుకున్నాడా?


వయసు మీద పడుతున్నా ఏ మాత్రం తగ్గని అందం బాలీవుడ్ నటి రేఖ సొంతం. తన అందం, అభినయంతో బాలీవుడ్ ను ఊర్రూతలూగించింది రేఖ. తాజాగా రేఖ జీవిత చరిత్ర 'రేఖ - ద అన్ టోల్డ్ స్టోరీ' సంచలనం రేపుతోంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అంశం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్, రేఖలు పెళ్లి చేసుకున్న విషయం ఈ పుస్తకంలో ఉందనే విషయం చర్చనీయాంశం అవుతోంది. అయితే, ఈ పుస్తక రచయిత యాసిర్ ఉస్మాన్ మాట్లాడుతూ, ఇవన్నీ పుకార్లేనని చెప్పాడు. ఈ పుస్తకంలో రేఖ, సంజయ్ దత్ పెళ్లి విషయం గురించి రాయలేదని తెలిపాడు.

సంజయ్ దత్, రేఖలు 1984లో ఓ సినిమాలో కలసి నటించారు. ఆ సమయంలో వీళ్లిద్దరి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు హల్ చల్ చేశాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ... మరికొందరు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంలో రేఖతో పెళ్లి విషయం గురించి సంజయ్ దత్ ను అడిగితే... ఆయన ఆ వార్తను ఖండించలేదు. దీంతో, వీరి పెళ్లి విషయం వాస్తవమే అని అందరూ భావించారు. ఈ విషయంపై ఉస్మాన్ మాట్లాడుతూ, అప్పట్లో పెళ్లి వార్తను సంజయ్ దత్ ఖండించి ఉంటే బాగుండేదని చెప్పాడు. అయితే, రేఖకు సంజయ్ దత్ సాయంగా ఉండటం వాస్తవమేనని... ఈ కారణంగానే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ అందరూ పొరపాటు పడ్డారని తెలిపాడు.

  • Loading...

More Telugu News