: హమ్మయ్య... ఆస్ట్రేలియాను ఆలౌట్ చేశారు!


జడేజా ఒకే ఓవర్ లో వాడే, లయన్ ల వికెట్లను వరుసగా తీయడం, అంతకుముందు స్టార్క్ వికెట్ ను అశ్విన్ పడగొట్టడంతో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజున ఆస్ట్రేలియా జట్టు 276 పరుగులకు ఆలౌటై, తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ 33, రెన్షా 60, స్మిత్ 8, మార్ష్ 66, హ్యాండ్స్ కోంబ్ 16, మార్ష్ 0, వాడే 40, స్టార్స్ 26, ఓకీఫే 4, లయన్ 0, హాజిల్ వుడ్ 1 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజాకు 6 వికెట్లు దక్కగా, ఆశ్విన్ 2, ఇషాంత్ శర్మ, యాదవ్ లకు చెరో వికెట్ దక్కాయి. మరికాసేపట్లో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News