: కలకలం రేపుతున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలు!


అమెరికా నేవీలో పని చేస్తున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలు సంచలనం రేపుతున్నాయి. సోషల్ మీడియాకు, కొన్ని వెబ్ సైట్లకు ఈ ఫొటోలను ఎవరో లీక్ చేశారు. లీక్ అయిన ఫొటోల్లో ఉన్నత స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు మహిళా ఉద్యోగులు ఉన్నారు. మహిళా సైనికులకు జరిగిన ఈ ఘోర అవమానంపై ఉన్నతాధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దీని వెనుక మిలిటరీ అధికారుల హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా నేవీకి సంబంధించి ఓ ఫేస్ బుక్ గ్రూప్ పేజీ ఉంది. ఇందులో దాదాపు 30 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్ లోనే ఈ ఫొటోలను వేలాదిగా అప్ లోడ్ చేశారు. మహిళా ఉద్యోగులు ఫొటోలతో పాటు వారి పేర్లు, ర్యాంక్ తదితర వివరాలను కూడా పేర్కొన్నారు. అంతేకాదు, వీరి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఫేస్ బుక్ పేజీని క్లోజ్ చేశారు. జరిగిన ఘటనపై అమెరికన్ నేవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News