: నోట్లు తీసుకునేటప్పుడు జాగ్రత్త.. కోట్లాది రూపాయల దొంగనోట్లు పట్టుబడ్డాయ్!


పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత తొలిసారి భారీ మొత్తంలో దొంగ నోట్లు పట్టుబడ్డాయి. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఏకంగా రూ. 4.5 కోట్ల విలువైన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో వీటిని పట్టుకున్నారు. ఈ నోట్లను లెక్కబెట్టడానికి పోలీసులకు రాత్రంతా పట్టిందట.

వివరాల్లోకి వెళ్తే, రాజ్ కోట్ కు చెందిన ఫైనాన్షియర్ కేతన్ దవేపై తుక్కు డీలర్ అయిన నితిన్ అజానీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దవేను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. దవే కార్యాలయంలో పోలీసుల సోదాల్లో భారీగా దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా తన సహచరులు పార్థ్ తెరియా, ఉమర్ గజ్జర్ అనే ఇద్దరు దాదాపు కోటి రూపాయల దొంగ నోట్లను తగలబెట్టేశారని దవే చెప్పాడు. గజ్జర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా... కార్లలో దొంగ నోట్లను దాచే అలవాటు దవేకు ఉందని చెప్పాడు. దీంతో, దవే కార్లలో వెతగ్గా... వాటిలో కూడా మరిన్ని దొంగనోట్లు బయటపడ్డాయి. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు.

మన దేశంలోకి భారీ ఎత్తున దొంగ నోట్ల ప్రవాహం మళ్లీ మొదలైందనే విషయం ఈ ఘటనతో అర్థమవుతోంది.  కాబట్టి, కరెన్సీ నోటును తీసుకునే ముందు, ఒకటికి రెండు సార్లు ఆ నోటును చెక్ చేసుకోవడం చాలా మంచిది.

  • Loading...

More Telugu News