: మీ భార్యను కొడతారా?... ముస్లింలకు ఓ అమెరికా ప్రజా ప్రతినిధి ప్రశ్నలు... సమాధానమిస్తేనే అపాయింట్ మెంట్!
తనను కలిసేందుకు వస్తున్న ముస్లింలకు ఓక్లహామా ప్రజాప్రతినిధి జాన్ బెన్నెట్ ఓ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి, దాన్ని పూర్తి చేస్తేనే అపాయింట్ మెంట్ ఇస్తానని చెబుతున్నారు. మొత్తం 9 ప్రశ్నలను ఆయన అడుగుతుండగా, అందులోని ప్రశ్నలు విస్తుపోయేలా ఉన్నాయి. ముగ్గురు ముస్లిం విద్యార్థులు ఆయన్ను కలిసేందుకు వెళ్లగా, బెన్నెట్ కార్యాలయ ఉద్యోగి, ఆ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. మీ భార్యను కొడతారా? ఇస్లాంను విడిచిపెడితే, ముస్లింలను తప్పకుండా శిక్షించాలని ఉన్న నిబంధనలతో ఏకీభవిస్తున్నారా? లేదా? వంటి పలు వివాదాస్పద ప్రశ్నలు ఉన్నాయి. కాగా, తమను ఎగతాళి చేసేందుకే ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేశారని ఓక్లహామా చాప్టర్ కౌన్సిల్ ఆన్ అమెరికన్ - ఇస్లామిక్ రిలేషన్స్ అధికారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.