: రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న కమలహాసన్?


విలక్షణ నటుడు కమలహాసన్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో, ఆయన ఆలోచనలు రాజకీయాలపైకి మళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు. తన అభిమాన సంఘాల నేతలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ అంశం కలకలం రేపింది. జయలలిత మరణం తర్వాత కమలహాసన్ వ్యవహారశైలిలో ఊహించని మార్పులు వచ్చాయి. జల్లికట్టు కోసం తన గొంతుకను కమల్ వినిపించారు. అంతేకాదు, పన్నీర్ సెల్వంను సీఎం పదవి నుంచి దింపడం, శశికళ ముఖ్యమంత్రి కావడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో, కమల్ తనదైన శైలిలో తీవ్రంగా స్పందించారు.

తమిళ రాజకీయాలపై పూర్తిగా విసుగు చెందానని... ఈ దేశాన్నే విడిచి వెళ్లిపోతానని ఓ సందర్భంగా కమల్ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. వాస్తవానికి తమిళనాడులో ఉండటానికే కమల్ ఇష్టపడరట. అలాంటి వ్యక్తి, ఇప్పుడు రాష్ట్ర పరిణామాలపై అనునిత్యం స్పందిస్తున్నారు. ఆయనలో వచ్చిన ఈ మార్పును చూసి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మార్పు వెనక ఓ బలమైన లక్ష్యం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు తన అభిమాన సంఘాల నేతలతో కమల్ సుదీర్ఘ మంతనాలు సాగించారు. ఈ సమావేశానికి కమలహాసన్ సంక్షేమ సంఘం నేతలు, సంఘానికి చెందిన న్యాయవాదులు కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం, తమిళనాడులోని సమస్యలన్నింటినీ తొలగించాలంటూ ప్రభుత్వానికి కమల్ అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో, రాజకీయాలపైపుగా కమల్ అడుగులు వేస్తున్నారంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News