: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. చంపేస్తారేమో!: గాయని, నటి సుచిత్ర
తన ప్రాణానికి రక్షణ లేదని, తనను ఎవరైనా చంపేస్తారేమోనని సెలబ్రిటీల వ్యక్తిగత చిత్రాలను బయటపెట్టి పెను సంచలనం రేపిన గాయని, నటి సుచిత్ర వ్యాఖ్యానించింది. ఎవరెవరో వచ్చి తనను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆమె, ఓ వ్యక్తి కాలింగ్ బెల్ కొట్టి, తలుపు తెరవాలని అరిచాడని, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్న తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది. చెన్నై పరిధిలోని ఎంసీఆర్ నగర్ లో ఉన్న పబ్బులో కలుసుకునే ఓ ముఠా ఈ పని చేయిస్తున్నట్టు తనకు అనుమానం ఉందని వెల్లడించింది.
కాగా, తొలుత తనతో హీరో ధనుష్ అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతూ, గాయాలైన చేతిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఆమె, ఆ తరువాత పలువురితో త్రిష సన్నిహితంగా ఉన్న చిత్రాలను, హన్సిక ముగ్గురు యువకులతో ఉన్న ఫోటోలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తన భార్యకు మానసిక స్థితి సరిగ్గా లేదని సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ, ఆమె రేపిన వివాదం మాత్రం ఇంకా సద్దుమణగలేదు.