: ప్రపంచ రికార్డు సృష్టించిన మలయాళ అంధ నేపథ్య గాయని
మలయాళ ప్రముఖ నేపథ్య గాయని వైకోమ్ విజయలక్ష్మి ఆదివారం ప్రపంచ రికార్డు సృష్టించారు. చూపు లేకపోయినా పట్టుదలతో రికార్డులకెక్కారు. ఒకే తీగతో సుమధుర స్వరాలు పలికే గాయత్రీ వీణపై ఐదు గంటలపాటు ఏకధాటిగా అద్భుత కచేరీ చేశారు. కోచిలోని యూనివర్సల్ రికార్డ్ ఫోరంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయలక్ష్మి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. హిందీ, మలయాళ, తమిళ భాషల్లో 67 పాటలను గాయత్రీ వీణపై వాయించి రికార్డు నెలకొల్పారు. అలాగే మరో 12 కీర్తనలను కూడా వాయించారు. విజయలక్ష్మి పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.