: సీన్ రివర్స్.. ఇప్పుడు ట్రంప్‌ను పొగుడుతూ ర్యాలీలు!


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరెత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమైన సొంత ప్రజలే ఇప్పుడాయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కనిపించిన చోటే ఇప్పుడు ఆయన మద్దతుదారులు అనుకూల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ట్రంప్‌ను కొనియాడుతూ కొలరాడో నుంచి న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ వరకు, అలాగే వాషింగ్టన్ స్మారక చిహ్నం వద్ద వందలాదిమంది ట్రంప్ అనుకూల నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.

ట్రంప్ లైఫ్‌సైజ్ కటౌట్లను చేబూని అధ్యక్షుడిని కొనియాడుతూ ర్యాలీలు నిర్వహించారు. మినెసొటాలోని సెయింట్‌పాల్‌లో నిర్వహించిన ర్యాలీలో 400 మందికిపైగా హాజరయ్యారు. మరోవైపు 50 మంది ట్రంప్ వ్యతిరేకులు ప్రదర్శనలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో టపాసులు కాల్చిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బర్కిలీలో రెండు వర్గాల వారు హెల్మెట్లు, మాస్కులు ధరించి పరస్పరం కొట్లాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపు చేశారు.

  • Loading...

More Telugu News