: విశాఖలో పే..ద్ద చొక్కా.. ఆవిష్కరించిన మంత్రి గంటా
విశాఖపట్టణంలో అతిపెద్ద చొక్కాను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సూరపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన 46 అడుగుల పొడవు, 23 అడుగుల పొడవున్న చొక్కా ప్రదర్శనను విశాఖపట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. వారి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి అన్నారు. ‘గెట్ మై టైలర్’ వ్యవస్థాపకుడు చరణ్ మాట్లాడుతూ స్టార్టప్ ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఈ అతి భారీ చొక్కాను రూపొందించినట్టు తెలిపారు. మంత్రి గంటా చేతుల మీదుగా ఈ చొక్కాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందిస్తామన్నారు.