: నవ్యాంధ్ర అసెంబ్లీ సూపర్.. త్వరలోనే అమరావతికి రాజ్‌భవన్.. గవర్నర్ నరసింహన్
నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ భవన సముదాయం అద్భుతమని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కితాబిచ్చారు. నూతన అసెంబ్లీ సమావేశాల్లో నేడు (సోమవారం) ప్రసంగించాల్సి ఉండడంతో ఆదివారం గవర్నర్ విజయవాడ చేరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నరసింహన్ నూతన అసెంబ్లీ సముదాయం అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. అతి తక్కువ సమయంలో అద్భుతంగా తీర్చిదిద్దారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. రాజధాని అమరావతికి, అసెంబ్లీకి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. త్వరలోనే రాజ్‌భవన్ కూడా అమరావతికి వస్తుందని గవర్నర్ తెలిపారు.