: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. శాసనసభ్యుల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలుండగా టీడీపీకి ఐదు లభిస్తాయి. ఆరో స్థానానికి పోటీ చేయకూడదని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. తాజా ప్రకటన ప్రకారం.. నారా లోకేశ్ (చిత్తూరు), పోతుల సునీత, కరణం బలరాం (ప్రకాశం), డొక్కా మాణిక్యవరప్రసాద్ (గుంటూరు), బచ్చుల అర్జునుడు (కృష్ణా)లకు అవకాశం కల్పించారు. కాగా మైనారిటీ వర్గానికి చెందిన నాగుల్ మీరా (గుంటూరు)కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేకపోవడంతో ఆయనను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. నారా లోకేశ్ నేడు (సోమవారం) నామినేషన్ వేయనున్నారు.