: పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు: నటి త్రిష
ప్రముఖ నటి త్రిషను నటుడు రానా ముద్దుపెట్టుకుంటున్న ఫొటో లీకైన విషయం తెలిసిందే. ఈ ఫొటోపై త్రిష స్పందిస్తూ వేదాంత ధోరణిలో ఓ ట్వీట్ చేసింది. ‘కర్మ’ అని రాసి ఉన్న ఆ పోస్ట్ లో ‘పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు.... ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, వాళ్లంతట వాళ్లే తెలుసుకుంటారు...’ అంటూ ఆ ట్వీట్ లో త్రిష పేర్కొంది.
కాగా, గత రెండు రోజులుగా గాయని సుచిత్ర కార్తీక్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ నుంచి సెలబ్రెటీల వ్యక్తిగత ఫొటోలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందంటూ జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సుచిత్ర ప్రయత్నిస్తున్నారు. మరోపక్క తన భార్య సుచిత్రకు మానసిక ఆరోగ్యం సరిగాలేదని ఆమె భర్త పేర్కొన్నారు.ఇక లీకైన ఫొటోల్లో హీరో ధనుష్, దర్శకుడు అనిరుధ్ లు పలువురు హీరోయిన్స్, సింగర్స్ తో చాలా సన్నిహితంగా ఉండటం గమనార్హం.