: సరబ్ జిత్ సింగ్ కన్నుమూత


లాహోర్లోని జైలులో పాక్ ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా మృత్యువుతో వీరోచిత పోరాటం సాగించిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ ఇక లేడు. బుధవారం అర్ధరాత్రి దాటాక 1. 30 గంటలకు ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. 49 సంవత్సరాల సరబ్ గత ముప్పై ఏళ్లుగా పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న సంగతి తెలిసిందే. గూఢచర్యం కేసులో ఆయనకు పాక్ న్యాయస్థానం మరణశిక్ష విధించగా, భారత్ సహా పలు స్వచ్చంద సంస్థలు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ వచ్చాయి. చివరికి సరబ్ జీవితం ఇలా దారుణ పరిస్థితుల్లో ముగిసింది.

  • Loading...

More Telugu News