: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. రెన్ షా స్టంపౌట్!


భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నకొంచెం సేపటికే  ఓపెనర్ రెన్ షా(60) స్టంపౌట్ అయ్యాడు. దీంతో, ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రెన్ షా, ఆ తర్వాత దూకుడుగా ఆడటంతో పెవిలియన్ కు ముఖం పట్టాల్సి వచ్చింది. 67వ ఓవర్ లో జడేజా వేసిన మూడో బంతిని ఆడేందుకు ముందుకు వచ్చిన రెన్ షా, కీపర్ వృద్ధి మాన్ సాహా చేతికి చిక్కాడు. 66 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో షాన్ మార్ష్ (25), హ్యాండ్స్ కాంబ్ (0)తో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News