: దుండగుల కాల్పుల్లో గాయపడ్డ దీప్ రాయ్ కు ప్రమాదం తప్పింది: సుష్మా స్వరాజ్


వాషింగ్టన్ లో ఓ శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ సిక్కు ఎన్ఆర్ఐ దీప్ రాయ్ (39)కు ప్రమాదం తప్పిందని, కోలుకుంటున్నారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. దీప్ రాయ్ తండ్రి సర్దార్ హర్ పాల్ సింగ్ తో తాను ఫోన్ లో మాట్లాడానని, దీప్ రాయ్ చేతిలోకి బుల్లెట్ వెళ్లిందని, అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారని అన్నారు. కాగా, అమెరికాలో ఇటీవల జరిపిన కాల్పుల్లో మృతి చెందిన హర్నీష్ పటేల్ కుటుంబానికి ఆమె తన సానుభూతి తెలిపారు. ఈ హత్య సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ఆ ట్వీట్ లో సుష్మ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News