: రెన్ షా హాఫ్ సెంచరీ.. స్కోరు 115 పరుగులు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆసీస్ ఆటగాడు రెన్ షా హాఫ్ సెంచరీ చేశాడు. 183 బంతుల్లో 5 బౌండరీలు కొట్టి అర్ధశతకం పూర్తి చేశాడు. 16 పరుగులతో కొనసాగుతున్న మరో బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ భారత్ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. కాగా, ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో 60 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 115 పరుగులు చేసింది.