: రేపు ఉదయం 11:06 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముహూర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. రేపు ఉదయం 11:06 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. ఆపై ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారని తెలిపారు. పండితులను సంప్రదించిన తరువాత ఉదయం 11:06 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు తెలిపారు. కాగా, గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుందన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

  • Loading...

More Telugu News