: ఒక్క పరాఠా తింటే... జీవితాంతం ఉచిత పరాఠాలంటున్న హోటల్
జీవితాంతం ఉచితంగా పరాఠాలు ఇచ్చే హోటల్ ఉంటే... భలే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే, మీరు హర్యానాలోని రోహ్ తక్ లో ఉన్న 'తపస్య పరాఠా భండార్'కు వెళ్లాల్సిందే. ఇక్కడ తయారు చేసే 'హిందుస్థాన్ స్పెషల్ పరాఠా' మీరు గంటలో తినగలిగితే, రూ. 5,100 నగదు బహుమతితో పాటు జీవితాంతం అదే హోటల్ లో ఉచితంగా పరాఠాలు తినవచ్చు. భలేగా ఉందీ పోటీ అనుకుంటున్నారా? అక్కడో కిటుకుందండోయ్... కిలో పిండితో తయారు చేసిన పరాఠా అది. ఒకటిన్నర అడుగు పొడవుండే ఈ పరాఠా తినడం కోసం ఎంతో మంది పోటీ పడి ఓడిపోతున్నారట. ఓసారి ప్రయత్నిద్దామనుకుంటే అక్కడికి వెళ్లి రండి!