: ట్రంప్ కు రెండు వారాల గడువిచ్చిన సియాటెల్ ఫెడరల్ కోర్టు


ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నివారించేలా ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై రెండు వారాల్లోగా స్పందించాలని అమెరికా న్యాయ శాఖకు సియాటెల్ ఫెడరల్ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అమెరికాలో అన్ని అనుమతులూ ఉన్న వారు, యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న తమ పిల్లలను చూసి వచ్చేందుకు ఈ ఆదేశాలు అడ్డంకులుగా మారాయని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

కాగా, ప్రస్తుతమిచ్చిన ఆదేశాలను సవరించుకుంటామని, మరో హేతుబద్ధ ఆదేశం దేశాధ్యక్షుడి నుంచి వస్తుందని న్యాయశాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. కాగా, న్యాయ శాఖ వివరణకు, వైట్ హౌస్ నుంచి వస్తున్న సంకేతాలకు పొంతన లేదని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, పిటిషనర్ల ఆవేదన, ఆగ్రహం తనకు అర్థమయ్యాయని అన్నారు. ట్రంప్ ఆజ్ఞలతో, సోమాలియాలో ఉన్న తన కుమారుడిని అమెరికాకు తెప్పించుకోలేకుండా ఉన్నానని, అమెరికన్ మహిళ ఒకరు కోర్టును ఆశ్రయించగా, పలువురు న్యాయవాదులు ఆమెకు మద్దతు పలుకుతూ, దీన్ని క్లాస్ యాక్షన్ సూట్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా మార్చాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News