: నా భార్య మానసిక సమస్యలతో బాధపడుతోంది...!: సెలబ్రిటీల ప్రైవేటు ఫోటోలను గాయని సుచిత్ర బయటపెడుతున్న వైనంపై భర్త స్పందన
ధనుష్ – త్రిష, సంగీత దర్శకుడు అనిరుద్ – హీరోయిన్ ఆండ్రియా, రానా – త్రిష, బుల్లితెర నటి దివ్యదర్శిని ఓ యువకునితో సన్నిహితంగా ఉన్న దృశ్యం... ఇలా ఎన్నో సంచలన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి, దానికి ‘ఇవి వారి రాసలీలలు’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చిన గాయని సుచిత్ర మానసిక రోగంతో బాధపడుతోందని ఆమె భర్త, నటుడు కార్తీక్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆమెకు విడాకులు ఇవ్వాలని తాను భావించడం లేదని, ఆ వార్తలు వదంతులేనని చెబుతూ, సుచిత్రకు మానసిక సమస్యలున్నాయని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్టును పెట్టారు. కాగా, సుచిత్ర పెడుతున్న ఫోటోలు దక్షిణాది పరిశ్రమలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.