: మాతో కలసిరండి: భారత్ కు మరోసారి చైనా ఆహ్వానం


పాకిస్థాన్ మీదుగా తాము ఏర్పాటు చేసిన ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులో భారత్ కలిసి రావాలని, ఈ ప్రాజెక్టుతో ఇండియాకు కూడా ఆర్థిక లాభాలు ఉంటాయని చైనా మరోసారి ఆహ్వానించింది. రీజనల్ కనెక్టివిటీని పెంచే సీపీఈసీలో ఇండియా భాగస్వామ్యం కావాలని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతినిధి ఫూ యింగ్ కోరారు. వచ్చే సంవత్సరం పాటించాల్సిన ఆర్థిక విధానాలపై బీజింగ్ లో పది రోజుల వార్షిక సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో యింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ సమావేశాలకు భారత్ తన ప్రతినిధులను పంపాలని అన్నారు.

కాగా, ఈ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీరు ప్రాంతం నుంచి సాగుతుండటంతోనే ఇండియా దీన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గతంలోనే భారత్ చైనాకు స్పష్టం చేసింది కూడా. ఈ ప్రాజెక్టు పరంగా ఇండియాకు లాభాలున్నప్పటికీ, భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఇది పీఓకే గుండా వెళుతుండటాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News