: ఇంటర్ ఇంగ్లీష్-2లో ముద్రణాలోపం... ఒక మార్కు కలపాలని ఏపీ బోర్డు నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు పేపర్ లో ముద్రణాలోపం చోటు చేసుకోవడంతో, ఆ ప్రశ్నకు సమాధానం రాసే ప్రయత్నం చేసిన వారికి 1 మార్కు కలపాలని బోర్డు నిర్ణయించింది. ఎనిమిదో ప్రశ్నలో ఒక ఫోటోను, ప్రకటనను ఇచ్చి, దానిపై ఐదు ప్రశ్నలు ఇచ్చారు. ఆ ఫోటోలో ఏముందో స్పష్టంగా తెలియక పోవడంతో, మొదటి ప్రశ్నకు సమాధానం రాసే అవకాశాలు లేవని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బోర్డు దృష్టికి రాగా, పేపర్ ను పరిశీలించిన అధికారులు, ఆ ప్రశ్న అటెంప్ట్ చేస్తే, ఒక మార్కు కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి బీ ఉదయలక్ష్మి మీడియాకు ఓ ప్రకటన వెలువరించారు.

  • Loading...

More Telugu News