: ఇండియాలోని 3.3 లక్షల మంది కాల్ సెంటర్ ఉద్యోగులకు షాకిస్తున్న ట్రంప్ కొత్త బిల్లు


అమెరికన్లకు ఉద్యోగాలను దగ్గర చేయడానికంటూ, ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన కొత్త బిల్లు, ఇండియాలోని 3.3 లక్షల మంది కాల్ సెంటర్ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యోగాలు విదేశాలకు పోరాదంటూ, విదేశాల్లో శాఖలను తెరిచే కంపెనీలపై కఠిన నిబంధనలను ఈ కొత్త బిల్లులో ట్రంప్ తెచ్చారు. ఇతర దేశాల్లో ఆఫీసులు పెట్టే అమెరికా కంపెనీలకు గ్రాంట్స్ కట్ చేయాలని, ఆ సంస్థలకు రుణాలను అందివ్వరాదని ట్రంప్ నిర్ణయించారు. చాలా అమెరికన్ సంస్థలు ఆఫ్ షోర్ సేవా కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో భాగంగా భారత గడ్డపై, వందల సంఖ్యలో కాల్ సెంటర్లను వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకుని, తక్కువ వేతనాలతో కాలం గడుపుతున్నాయి. ట్రంప్ తాజా బిల్లుతో, అమెరికన్ కంపెనీలు కాల్ సెంటర్లను తీసివేయాలని నిర్ణయిస్తే, వాటిని నమ్ముకుని కాలం గడుపుతున్న లక్షలాది మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

  • Loading...

More Telugu News