: 40 ఏళ్ల తరువాత చెత్త ప్రదర్శనను పునరావృతం చేసిన టీమిండియా
టీమిండియా టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డును 40 ఏళ్ల తరువాత పునరావృతం చేసింది. వరుసగా మూడు ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగుల లోపు 1977 తర్వాత మళ్లీ ఇప్పుడు ఆలౌట్ అయింది. దీంతో మరోసారి చెత్త రికార్డును పునరావృతం చేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 105 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 107 పరుగులకే ఆలౌటై ఘోరపరాభవం మూటగట్టుకుంది. నేడు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 186 పరుగులకే ఆలౌటైంది. దీంతో సొంత గడ్డపై భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్ లో 200 పరుగులలోపు 1977 తరువాత మళ్లీ ఇప్పుడే ఆలౌట్ కావడం విశేషం.