: నిర్మాత అవతారమెత్తి... 'బిలీవ్ ఇన్ యూ' అంటున్న రాశీఖన్నా!


టాలీవుడ్ యువనటి రాశీ ఖన్నా నిర్మాత అవతారమెత్తి 'బిలీవ్ ఇన్ యూ' అంటోంది. ‘వూహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా, మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోకపోయినా చక్కగా ఆఫర్లను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. హైదరాబాదులో ఇల్లు తీసుకున్న రాశీ... హైదరాబాదు వేదికగా ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్ లో ఓ షార్ట్ ఫిల్మ్ తో ముందుకు రానుంది.

బిలీవ్ ఇన్ యూ పేరుతో ఈ వీడియోను విడుదల చేయనుంది. ఈ వీడియోకు సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసింది. మహిళా దినోత్సవం తన హృదయానికి చాలా దగ్గరైన రోజని తెలిపింది. ఇందుకోసం తన వంతు కృషిగా ఏమైనా చేయాలనుకున్నానని తెలిపిన రాశీ అందులో భాగంగా, తన ప్రొడక్షన్‌ లో ఈ వీడియోను రూపొందిస్తున్నానని పేర్కొంది.

  • Loading...

More Telugu News