: నేను మంచి దుస్తులే వేసుకున్నాను... నా బాడీ పట్ల నేను గర్వంగా ఫీలవుతాను: సోనమ్ కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఈ మధ్య ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కు చిత్రమైన డ్రెస్ వేసుకొచ్చింది. ఈ డ్రెస్ లో ఆమె అందాలు విందు చేశాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఆ ఈవెంట్ కు వేసుకొచ్చిన డ్రెస్ పై పెనుదుమారం రేగింది. దానిపై ఆమె వివరణ ఇచ్చింది. తన దుస్తుల వెనక ఏముందో ప్రజలు చూడలేకపోయారన్నది వాస్తవమని తెలిపింది. తాను మాత్రం మంచి డ్రెస్ ధరించానని తెలిపింది. తాను మంచి డ్రెస్ వేసుకున్నాను కనుక సమస్య తనతో కాదని, తన డ్రెస్ బాగోలేదన్న వారితోనే సమస్య అని తెలిపింది.
వేసుకునే దుస్తులను బట్టి ఒక వ్యక్తిపై అభిప్రాయం మారితే అది చూసేవారి దృష్టికోణాన్ని భయటపెడుతుందని చెబుతూ సోనమ్ కపూర్ తన డ్రెస్ ను విమర్శించిన వారిని ఎద్దేవా చేసింది. తన బాడీ పట్ల తాను గర్వంగా ఫీలవుతున్నానని తెలిపింది. డ్రెస్సు వివాదంలో తనకు మద్దతు తెలిపిన తోటి నటీమణులు భూమి ఫడ్నేకర్, సోఫీ చాదరీలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలా చేసిన తప్పు సరిదిద్దుకోవడం మానేసి, నెటిజన్లపై సోనమ్ మండిపడుతుండడాన్ని పలువురు తూర్పారపడుతున్నారు.