: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న హిల్లరీ క్లింటన్ ఫోటో!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అనంతరం డెమొక్రాటిక్‌ నేత హిల్లరీ క్లింటన్‌ మీడియాకు అందుబాటులో లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎక్కడికో విమానంలో ప్రయాణిస్తున్న ఆమె 'యూఎస్‌ఏ టుడే' పత్రికలోని వార్తను తీక్షణంగా చదువుతున్న ఫోటోను ఎవరో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇంతకీ, ఆమె అంత తీక్షణంగా చదువుతున్న వార్తలో ఏముందంటే... అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా తన వ్యక్తిగత ఈమెయిల్స్ వినియోగిస్తున్నారు. దీనిని హిల్లరీ ఈమెయిల్స్ వ్యవహారంతో అంతా పోల్చుతున్నారు. ఇది ప్రమాదకరమని ఆ వార్త సారాంశం. దీంతో ఆ వార్తను యూఎస్ఏ టుడే మొదటి పేజీలో ప్రచురించగా, దానిని హిల్లరీ ఆసక్తిగా చదివారు. 

  • Loading...

More Telugu News