: శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని చూస్తే బాధేస్తోంది: చంద్రబాబు
అమెరికాలో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. హైదరాబాదులోని బాచుపల్లిలో ఉంటున్న శ్రీనివాస్ కుటుంబం నివాసానికి వెళ్లిన చంద్రబాబునాయుడు వారిని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ, ఇలాంటి దాడులను అరికట్టడానికి కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. అమెరికాపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఇందుకోసం అందరం కలిసి పోరాడాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీనివాస్ కుటుంబాన్ని చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. శ్రీనివాస్ భార్య సునయన మనోధైర్యం పెంచుకోవాలని ఆయన సూచించారు. ఆమె ధైర్యంగా ఉండి, శ్రీనివాస్ ఆశయాలు నెరవేర్చాలని ఆయన అన్నారు.