: ఉత్కంఠకు తెర.. శివ‌సేన‌తో మ‌ళ్లీ కలిసిన బీజేపీ.. న‌గ‌ర‌ మేయర్ శివసేన అభ్యర్థిగా మహేందేశ్వర్


బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అందులో బీజేపీ కంటే రెండు స్థానాలు ఎక్కువ‌గానే శివ‌సేన గెలుచుకుంది. అయితే, మేయర్ పదవి పైన ఇన్నాళ్లు ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఆ ఎన్నిక‌కు కావాల్సిన పూర్తి మెజార్టీ ఏ పార్టీకి రాక‌పోవ‌డంతో మేయ‌ర్ ప‌ద‌వి ఏ పార్టీకి చెందిన అభ్య‌ర్థిని వ‌రిస్తోంద‌న‌న్న ఆస‌క్తి అందరిలోనూ నెల‌కొంది.

అయితే, ఈ రోజు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌విస్ మీడియాతో మాట్లాడుతూ.. ముంబై మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు తాము పోటీ పడడం లేదని ప్ర‌క‌టించారు. శివ‌సేన‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. ముంబై ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని అన్నారు. మ‌రోవైపు ముంబై న‌గ‌ర‌ మేయర్ శివసేన అభ్యర్థిగా మహేందేశ్వర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా హరేశ్వర్ వర్లేకర్ పేరును శివ‌సేన ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News